సుడిగాలి సుదీర్.. ఈ పేరుకి బుల్లితెరపై ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లోకి ఒక సాదాసీదా కామెడీయన్ గానే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు సుడిగాలి సుదీర్. ఇక జబర్దస్త్ లోకి వచ్చినప్పటినుంచి యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతు  బుల్లితెర ప్రేక్షకులందరి చూపును  తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్ లో టీం లీడర్ గా అందరినీ ఆకట్టుకుంటూనే మరోవైపు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇంకోవైపు మ్యాజిక్ షో లు కూడా చేస్తూ మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలా తనలోని మల్టీ టాలెంట్ చూపించి ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో సుడిగాలి సుదీర్ టీం ఎప్పుడు సరికొత్త స్కిట్ తో తెరమీదికి వస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్ స్కిట్ చూడటానికి ఎంతో మంది జబర్దస్త్ చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింద. ఈ ప్రోమో ఎప్పటిలాగానే ఎంతో సందడి సందడిగా సాగిపోయింది.



 అయితే ఈ ప్రోమో చూసుకుంటే సుడిగాలి సుధీర్ టీం మళ్లీ ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా సుడిగాలి సుదీర్ డిస్కో డాన్సర్ గా మారిపోయాడు. డిస్కో డాన్సర్ గెటప్లో ఎక్స్ ట్రా జబర్దస్త్  స్టేజ్ మీదకి వచ్చిన సుడిగాలి సుదీర్ ఇక తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాడు అని చెప్పాలి. ఏకంగా పాటలు పాడుతూనే అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. దీంతో సుధీర్ కి సంబంధం లేకుండానే కామెంట్లతో రెచ్చిపోయే సుధీర్ అభిమానులు.. ఇక ఇప్పుడు సుధీర్ అదిరిపోయే కామెడీ చేయడంతో సుధీర్ అన్న నువ్వు సూపర్ అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: