ఈ మధ్య హీరోయిన్లు అందరు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు.. కొంతమంది చెప్పకుండా పెళ్ళి చేసుకుంటే మరి కొంత మంది అందరి సమక్షంలో గ్రాండ్ గా పెళ్ళి చేసుకుంటున్నారు..పెళ్ళి చేసుకున్న వెంటనే పిల్లలను కనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నీమధ్య చందమామ బ్యూటీ  కాజల్ అగర్వాల్ కూడా ఓ బిడ్డకు తల్లి అయ్యింది..ఇప్పుడు మరో హీరోయిన్ తన సీమంతాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది..ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు..


ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రెండో హీరోయిన్ గా మెప్పించిన సంజనా గల్రాని తెలుగులో తక్కువ సినిమాలే చేసినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..కన్నడ లో ఎన్నో సినిమాలను చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.గతంలో కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి కూడా వెళ్ళొచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడు డాక్టర్ పాషాని 2021 జనవరిలో వివాహం చేసుకున్న సంజన ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.


సంజనా స్నేహితులు ఆమెకి సింపుల్ గా ఇంట్లోనే శ్రీమంతం నిర్వహించారు. దీంతో ఎమోషనల్ అయిన సంజన ఆ శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి నా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఎంతో ప్రేమగా శ్రీమంతం నిర్వహించారు అంటూ పోస్ట్ చేసింది. తాజాగా సంజనా మరోసారి శ్రీమంతం చేసుకుంది. ఈ సారి సంజనా అత్తామామలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలను కూడా అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.


నువ్వే నా బలం, నా ఆనందం, నా ఎనర్జీ, నా సర్వసం అన్ని. మనల్ని విడదీయడానికి కొన్ని పరిస్థితులు, కొంతమంది మనుషులు ప్రయత్నించారు. అయినా నువ్వు నాతోనే ఉన్నావు. ఆ దేవుడి ఆశీర్వాదాలు, మన తల్లితండ్రుల ఆశీర్వాదాలు మనకి ఉన్నాయి. ఒక సెలబ్రిటీగా బయటకి వచ్చినప్పుడు పేరు, డబ్బు సంపాదించడానికి కష్టపడుతూనే కుటుంబం కోసం సమయం కేటాయించాలి అని తెలుసుకున్నాను.. ఈ ఈవెంట్ ను నా అత్త మామలు గ్రాండ్ గా నిర్వహించారు..నాకు ఎప్పుడూ సపోర్ట్ గా నిలిచారు. నాకు ఈవెంట్ చాలా స్పెషల్ అందరికి ధన్యవాదాలు కూడా తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: