తెలుగులో ఉన్న మహిళా దర్శకులలో ఒకరైన నందిని రెడ్డి గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  నందిని రెడ్డి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకురాలిగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకుంది.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళా దర్శకురాలిగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నందిని రెడ్డి కి హీరోయిన్ సమంత కు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.  సమంత ,  నందిని రెడ్డి కాంబినేషన్ లో జబర్దస్త్ ,  ఓ బేబీ సినిమాలు తెరకెక్కాయి.  

ఈ రెండు సినిమా లలో జబర్దస్త్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకాదరణ పొందక పోయినప్పటికీ,  ఓ బేబి సినిమ మాత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.  ఇది ఇలా ఉంటే నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, ఆమె విడాకులు తదితర విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దాదాపుగా  నా  కెరియర్ సమంత  కెరియర్  ఒకే టైమ్ లో ప్రారంభం అయ్యాయి.  జబర్దస్త్ సినిమా విషయంలో ఆమె ఆరోగ్యం బాగోలేక పోవడం,  ఇతర సమస్యల వల్ల మేమిద్దరం ఇంకా చాలా సన్నిహితులము అయ్యాము.

కాకపోతే మేము ఇద్దరము ఎంత సన్నిహితంగా ఉన్నా మా హద్దులు మాకు ఉంటాయి.  వ్యక్తిగతమైన విషయా లలో మరియు కెరియర్ పరమైన విషయాలలో మేము మా హద్దులను అస్సలు క్రాస్ చేయము.  అలాగే సమంత కు సంబంధించిన పర్సనల్ విషయాల్లో నేను అస్సలు జోక్యం చేసుకోను.  అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించను అని తాజా ఇంటర్వ్యూలో మహిళా దర్శకురాలు నందిని రెడ్డి  తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: