యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ 'కే జి ఎఫ్ చాప్టర్ 2'  సినిమా విడుదల కాకముందే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు.  ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి కూడా అయ్యింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సలార్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  

అసలు విషయంలోకి వెళితే...  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని వచ్చేవారం అఫీషియల్ గా చిత్ర బృందం విడుదల చేయబోతోంది అంటూ ప్రస్తుతం ఒక వార్త నెట్టింట్లో  తెగ వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ ని  ప్రశాంత్ నీల్  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సలార్ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది.  

ఇప్పటికే సలార్ సినిమాలో శృతి హాసన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా సలార్ మూవీ లోని శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.  ప్రభాస్ 'సలార్'  సినిమాతో పాటు ఆది పురుష్ ,  ప్రాజెక్ట్ కే ,  సినిమాలలో కూడా నటిస్తున్నాడు.   ఆది పురుష్  సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతూ ఉండగా , ప్రాజెక్టు కే సినిమా పాన్ వరల్డ్ సినిమాగా  తెరకెక్కుతోంది.  ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ,  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: