కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శివ కార్తికేయన్ తాను నటించిన సినిమా లలో కొన్నింటిని తెలుగులో కూడా డబ్ చేసి  విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శివ కార్తికేయన్ తాజాగా 'డాన్'  సినిమాలో హీరోగా నటించాడు.  

ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా , ఈ సినిమాకు సీబీ చక్రవర్తి దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో సముద్ర కని , ఎస్ జె సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.  ఇది ఇలా  ఉంటే ఈ సినిమాను మే 13 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో డాన్ చిత్ర బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , మరియు  సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.  అందులో  భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కార్తికేయన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. 

తాజా ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ... పర్వతం టాలీవుడ్ దర్శకుడు అనిదీప్  కే.వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నాను.  ఈ మూవీలో నటించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది.  అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జాతి రత్నాలు మూవీ కి సీక్వెల్ కాదు.  ఫ్రెష్ కథతో తమిళ నేటివిటీతో  సినిమాను తెరకెక్కిస్తున్నామని తాజా ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: