ఒక నటుడు తనలో ఉన్న టాలెంట్ తో ఎన్ని భాషలలో అయినా సరే నటించి మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ విధంగా ఇప్పటి వరకు చాలా మంచి నటీనటులు ఒక పరిశ్రమ నుండి మరొక పరిశ్రమలో నటించి తమకంటూ ఆదరణ దక్కించుకున్నారు.

అలాంటి వారిలో ఒకరే ప్రముఖ తమిళ దర్శకుడు మరియు నటుడు సముద్రఖని. ఈయన తనదైన విలక్షణ నటనతో సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు.అందుకే తమిళ్ లో డైరెక్టర్ గా మరియు నటుడిగా సత్తా చాటిన సముద్రఖని ఇప్పుడు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ బాగా జోరుగా దూసుకుపోతున్నారు. నటన బాగుండాలి కానీ తెలుగు ప్రేక్షకులు ఏ భాషకు చెందిన నటుడు అయినా కానీ హక్కున చేర్చుకుంటారు. ఈయన ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ లుగా నిలిచాయి. సినిమాలో స్కోప్ లేకుండా కేవలం ఇతని కోసమే పాత్రలను సృష్టించేందుకు సిద్దంగా ఉన్నారట టాలీవుడ్ డైరెక్టర్ లు అంతలా తన ప్రతిభతో సముద్రఖని సక్సెస్ అవుతున్నాడు. ఈయన నటించిన చిత్రాలలో బన్నీ 'అల వైకుంటపురంలో'., క్రాక్ .. ఇది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కాయి.. ఇందులో సముద్ర ఖని విలన్ గా నటించి విచిత్రమైన మేనరిజమ్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలు ఇచ్చిన విజయంతో వరుసగా భీమ్లా నాయక్, లేటెస్ట్ గా ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును కూడా అందుకున్నాడు.

ఈ సినిమాలు అన్నీ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. అందుకే సెంటిమెంట్ గా ఇతనిని సినిమాలో ఉంచడానికి డైరెక్టర్లు తెగ ఎగబడుతున్నారు. ఆ ప్రభావమే ఈ రోజు విడుదలయిన మహేష్ బాబు మూవీ 'సర్కారు వారి పాట'లో విలన్ పాత్ర రాజేంద్ర నాథ్ గా ఆయన మన ముందుకు వచ్చాడు. ట్రెయిలర్ లో చూపించిన ప్రకారం చూస్తే... సముద్రఖని ఖాతాలో మరో హిట్ పడినట్లే అని తెలుస్తోంది. కానీ ఫుల్ లెంగ్త్ రోల్ లో ఎలా ఆకట్టుకున్నాడు అన్నది చూడాలి. ఈ సినిమాను డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించాడని అందరికి తెలిసిందే . మొదటి షో నుండి ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఇక కలెక్షన్ ల గురించి మనకీ అప్డేట్ తెలియాల్సి ఉంది. మరి ఇందులో సముద్రఖని పాత్ర ఎలా ఉందో ఇంకాసేపట్లో తెలుస్తుంది మనకి

ఇక సముద్రఖని విలన్ గా నటించిన తమిళ సినిమా ఒకటి రేపు విడుదల కానుందట.. కోలీవుడ్ లో మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్న యంగ్ హీరో శివ కార్తికేయన్... ఇతను హీరోగా రేపు డాన్ సినిమా రిలీజ్ కానుందట. ఈ సినిమాకు శిభి చక్రవర్తి డైరెక్టర్ గా వ్యవహరించారని తెలుస్తుంది.. మరి ఈ రెండు సినిమాలు సముద్రఖని కి మంచి పేరును తీసుకు వస్తాయా లేదా అన్నది తెలియాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: