సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తాజాగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే.  మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ నిన్న అనగా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ లలో సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యింది.

అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో,  ఈ సినిమాకు మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కూడా అదిరిపోయే రేంజిలో వచ్చాయి. అందులో భాగంగా సర్కారు వారి పాట సినిమాకు నైజాం ఏరియాలో మరింత ఎక్కువగా కలెక్షన్ లు వచ్చాయి.  సర్కారు వారి పాట మూవీ నైజాం ఏరియాలో నాన్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ వీ గా నిలిచింది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ నైజాం ఏరియా లో మొదటి రోజు 23.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాతి స్థానంలో సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియాలో మొదటి రోజు 12.24 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి నాన్ 'ఆర్ ఆర్ ఆర్'  సినిమాగా రికార్డు సృష్టించింది. మరి రాబోయే రోజుల్లో సర్కారు వారి పాట సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను నైజాం ఏరియాలో సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: