మహానటి కీర్తి సురేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు తన అందంతో , నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది.  నేను శైలజ సినిమా తర్వాత కీర్తి సురేష్ 'మహానటి'  సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ ను సాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కీర్తి సురేష్ అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.

తాజాగా కూడా కీర్తి సురేష్ తమిళంలో సాని కాయుదం అనే ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో చిన్ని పేరుతో విడుదలైంది. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' లో విడుదల అయ్యింది. తాజాగా విడుదలైన చిన్ని సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  ఇలా తాజాగా విడుదల అయిన చిన్ని సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్న కీర్తి సురేష్ ,  తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో కథానాయికగా నటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సర్కారు వారి పాట మూవీ నిన్న అనగా మే 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.  

సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి సురేష్ కు మహానటి లాంటి భారీ పాత్రను పోషించిన మీకు సర్కారు వారి పాట మూవీలోని కళావతి లాంటి మాస్‌ క్యారెక్టర్‌ చేయడం చాలా ఈజీ అయ్యుంటుందనుకోవచ్చా అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు లేదు... సర్కారు వారి పాట మూవీ లోని కళావతి పాత్ర కూడా చాలెంజింగ్‌ పాత్రే.  కళావతి పాత్రలో చాలా ఫన్‌ ఉంది. నా దృష్టిలో ఏడిపించడం మరియు నవ్వించడం రెండు కూడా చాలా కష్టం. ఈ రెండూ చేయడం పెద్ద సవాల్‌.  డైలాగ్‌ డెలివరీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దర్శకుడు పరశు రామ్ గారి హెల్ప్‌తో డబ్బింగ్‌ చెప్పాను. ఏ క్యారెక్టర్ సవాల్‌ దానికి ఉంటుంది. మహానటి  పాత్ర సవాల్‌ మహానటి ది.. కళావతి పాత్ర సవాల్‌ కళావతిది అంతే అని కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: