మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కుర్ర హీరోయిన్ లతో పోటీగా సినిమాలలో నటిస్తూ తమన్నా దూసుకుపోతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా కేవలం తెలుగు సినిమా లలో మాత్రమే కాకుండా హిందీ , తమిళ్ లాంటి ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ ఆ భాషలో కూడా మంచి విజయాలను అందుకొని అక్కడ కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో నటించిన రెండు సినిమాలు కూడా అతి తక్కువ వ్యవధివలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.  

ప్రస్తుతం తమన్నా 'ఎఫ్ 3'  సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా , మెహరీన్ ఈ మూవీ లో  హీరోయిన్ లుగా నటించారు.  ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా తమన్నా , వెంకటేష్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు మిల్క్ బ్యూటీ తమన్నా 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో  కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సత్య దేవ్  హీరోగా నటించాడు.  

సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది.  గుర్తుందా శీతాకాలం సినిమాను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలనే ఉద్దేశంలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇలా  అతి తక్కువ వ్యవధి లోనే మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తమన్నా ఈ రెండు సినిమా లతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: