యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్'  సినిమాతో  పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నడు. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు.  ఇలా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే  మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్  ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 వ తేదీన రానున్నట్లు తెలుస్తోంది.  జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 వ తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ సరి కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఆ స్టైలిష్ లుక్ కోసం ఎన్టీఆర్ తో ఒక ఫోటో షూట్ ను కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  మరి ప్రశాంత్ నీల్  ఎన్టీఆర్ ను ఏ రేంజ్ స్టైలిష్ లుక్ లో చూపిస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: