తెలుగు లో ఉన్న ఫేమస్ యాంకర్ లలో ఒకరైన శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ శ్రీ ముఖి ఎన్నో ప్రముఖ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లితెర అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. శ్రీ ముఖి కేవలం టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా , అనేక సినిమా లలో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. కొంత కాలం క్రితం శ్రీ ముఖి క్రెజీ అంకల్స్ అనే మూవీ లో  ప్రధాన పాత్రలో నటించింది.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ ముఖి కి విజయాన్ని తీసుకు రాకపోగా శ్రీ ముఖి కెరియర్ లో క్రేజీ అంకల్స్ మూవీ ఒక చెత్త సినిమాగా మిగిలిపోయింది.  

ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో సీజన్ 3 లో పాటిస్పేట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.  బిగ్ బాస్ షో ద్వారా కూడా శ్రీ ముఖి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ డే కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి , శ్రీ ముఖి కి తను నటించే ఒక సినిమాలో అవకాశాన్ని ఇస్తాను అని స్టేజి మీద బహిరంగంగా అనౌన్స్మెంట్ చేశాడు.  అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా లో శ్రీ ముఖి కి అవకాశం దక్కింది.  ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

అలా మెహర్ రమేష్ కు మరియు శ్రీ ముఖి కి మధ్య పరిచయం ఏర్పడింది.  ఇక తాజాగా  శ్రీ ముఖి పుట్టిన రోజు సందర్భంగా మెహర్ రమేష్ సోషల్ మీడియా లో ఒక స్పెషల్ పోస్ట్ చేసాడు. శ్రీ ముఖి ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెబుతూ శ్రీ ముఖి కి సోషల్ మీడియా వేదికగా మెహర్ రమేష్ బర్త్ డే విషెస్ చెప్పాడు.  ఇక మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషెస్‌ కు యాంకర్ శ్రీ ముఖి స్పందించింది. భోళా శంకర్‌ మూవీ లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సర్ అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: