రాక్ స్టార్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ లో మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా టాలీవుడ్ లో చరణ్ వంటి స్టార్ హీరోతో చేస్తున్న మూవీ కావడంతో కథ, కథనాల విషయమై దర్శకుడు శంకర్ కూడా ఎంతో పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనుండగా అందులో ఒకటి వృద్ధ పాత్ర కాగా మరొకటి యువకుడి రోల్ అని అంటున్నారు.
ఇటీవల లీక్ అయిన ఒక పిక్ ని బట్టి చూస్తే చరణ్ ఇందులో డబుల్ రోల్ చేస్తుంది నిజమే అని కొందరు అంటున్నారు. అయితే పక్కాగా చరణ్ ఇందులో రెండు పాత్రలు చేస్తున్నారా లేదా అనే దానిపై మాత్రం ఆయన ఫ్యాన్స్ లో ఒకింత ఆలోచన మాత్రం మెదులుతోంది. కాగా దీనిపై పక్కాగా క్లారిటీ రావాలి అంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.