ప్రస్తుతం సినీ ప్రేమికులు 'ఓ టి టి' లకు ఏ రేంజ్ లో అలవాటుపడిపోయారో మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం వరకు 'ఓ టి టి' లను తక్కువగా వినియోగించే వారు కూడా దేశంలో లోకి కారోనా ఇంటర్ అయిన తర్వాత 'ఓ టి టి' లకు బాగా అలవాటు పడిపోయారు. దేశం లోకి కారోనా ఎంటర్ అయిన తర్వాత థియేటర్ లపై ప్రభుత్వాలు ఆంక్షలను విధించడం,  మరియు కారోనా సమయంలో కొన్ని రోజుల పాటు థియేటర్ లను పూర్తిగా మూసివేయడంతో సినీ ప్రియులు చాలా మంది 'ఓ టి టి' లకు అలవాటు పడిపోయారు.  

దానితో 'ఓ టి టి' సంస్థలు కూడా ప్రతి వారం మంచి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు ముందుకు వస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయినప్పటికీ  అతి తక్కువ కాలంలోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.  ఇందులో భాగంగా తాజాగా శ్రీ విష్ణు నటించిన సినిమా 'భళా తందనాన'  కూడా అతి తక్కువ రోజుల్లోనే 'ఓ టి టి' లోకి రాబోతుంది.  తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. శ్రీవిష్ణు హీరో గా కేథరిన్‌ హీరోయిన్ గా తెరకెక్కిన భళా తందనాన సినిమాకు  చైతన్య దంతులూరి దర్శకత్వం వహించగా రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.

మే 6 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన భళా తందనాన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను సంపాదించుకుంది.  అలా బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను సంపాదించుకున్న భళా తందనాన సినిమా నెల రోజులు కూడా తిరగకుండానే 'ఓ టి టి' స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.  బాల తందనాన సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి'  లో ఈ నెల 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి'  సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: