లోకనాయకుడు కమల్ హాసన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ తన నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కమల్ హాసన్ వెండి తెర ద్వారా ప్రేక్షకులను అలరించి చాలా సంవత్సరాలు అవుతుంది. కమల్ హాసన్ విశ్వరూపం సినిమా ద్వారా చివరగా ప్రేక్షకులను అలరించాడు.  ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ ని మొదలు పెట్టాడు. 

కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల భారతీయుడు 2 మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత  నిలిచిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.  

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది  అసలు విషయంలోకి వెళితే...  విక్రమ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో కోలీవుడ్ హీరో సూర్య కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఒక వార్త కోలీవుడ్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.  మరి ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: