రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఎన్నో అంచనాల నడుమ భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన రాధే శ్యామ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తెచ్చుకొని చివరగా ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.  

రాధే శ్యామ్ సినిమాతో అపజయాన్ని బాక్సాఫీస్ దగ్గర ఎదురుకున్న  ప్రభాస్ ప్రస్తుత ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ ,  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ ,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్ లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూడు సినిమాలు సెట్స్  పై ఉండగానే ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పీరిట్ మూవీ లో నటించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం  ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళితే...  ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ లో హీరోయిన్ ఎంపికను ఇప్పటికే చిత్ర బృందం ప్రారంభించినట్లు , అందులో భాగంగా స్పిరిట్ చిత్ర బృందం కియారా అద్వానీ గాని రష్మిక మందన ను గాని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు,  ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని స్పీరిట్ మూవీ లో హీరోయిన్ గా తీసుకొనే ఆలోచనలో స్పిరిట్ మేకర్స్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: