మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదలైన విషయం మన అందరికీ తెలిసిందే. సైరా నరసింహ రెడ్డి లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడం,  ఆచార్య సినిమా వరకు అపజయం అంటూ ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఆచార్య సినిమా విడుదల అయిన మొదటి షో నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది.  

అలా ఆచార్య సినిమాకు మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అది తక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి.  దానితో ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో  'ఓ టి టి' లో స్ట్రీమింగ్ రాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి.  అయితే తాజాగా ఆచార్య  సినిమా 'ఓ టి టి' స్ట్రీమింగ్ కి  సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది.  

ఆచార్య సినిమా ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 20 వ తేదీ నుండి  స్ట్రీమింగ్ కాబోతోంది.  ఈ విషయాన్ని ప్రముఖ 'ఓ టి టి'  సంస్థ అమెజాన్ ప్రైమ్ తాజాగా ప్రకటించింది.  ఆచార్య సినిమా థియేటర్ లలో విడుదల అయిన తర్వాత కనీసం నెల రోజులు కూడా గడవకముందే 'ఓ టి టి' స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది.  మరి థియేటర్ లలో  ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఆచార్య సినిమా 'ఓ టి టి' ద్వారా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: