ప్రస్తుత కాలంలో సినిమా 50 రోజులు థియేటర్ లలో ఆడడం అనేది చాలా గొప్ప విషయంగా మారిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకున్న సినిమాలు కూడా రెండు, మూడు వారాలు తిరిగే సరికి థియేటర్లలో కనిపించకుండా పోతున్నాయి. అలాగే మిక్సీడ్ టాక్ ను తెచ్చుకున్న స్టార్ హీరోల  సినిమాలు కూడా నెల తిరక్కుండానే ఏదో ఒక 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య ఒక సినిమా 50 రోజుల థియేటర్ లలో ప్రదర్శించడం అనేది ఈ రోజుల్లో గొప్ప విషయంగా మారిపోయింది.

అలా 50 రోజులు ఇక సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడలి అంటే ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి  ఉండాలి,  అలాగే అన్ని రకాల ప్రేక్షకుల మన్నలనను కూడా ఆ సినిమా పొందినట్లయితే అలాంటి సినిమాలు ఈ రోజుల్లో చాలా అరుదుగా 50 రోజులు థియేటర్ లలో ప్రదర్శించ బడుతున్నాయి.  ఇలాంటి అరుదైన మైలురాయిని తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా అందుకుంది.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవ్ గన్, శ్రేయ, సముద్ర ఖని ప్రధానపాత్రలలో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్'  సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయ్యింది.

విడుదలైన మొదటి షో నుండే విడుదల అయిన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా 'ఆర్ ఆర్ ఆర్'  మూవీ నేటితో 50 రోజుల బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 'ఆర్ ఆర్ ఆర్'  సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1190.90 కోట్ల కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం కూడా 'ఆర్ ఆర్ ఆర్'  సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: