ఉపాసన కొణిదెల.. ఇక ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా అలాగే మెగా స్టార్ చిరంజీవి కోడలిగా ఎంతో చక్కగా బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు.ఇక ఈమె ఒకవైపు మెగా ఇంటి బాధ్యతలతో పాటు అలాగే తన అపోలో హాస్పిటల్ వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.ఇంకా అలాగే సామాజిక అంశాలపై కూడా ఎంతో చలాకీగా ఉండే ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి చేత ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంటున్నారు.ఇలా వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉండే ఉపాసన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సూచనలు చేస్తూ ఇంకా అలాగే ఎన్నో రకాల మంచి సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. ఇక మూగజీవాలను దత్తత తీసుకోవడం ఇంకా వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టడమే కాకుండా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సేవలను కూడా అందిస్తూ, వృద్ధాశ్రమాలకు సహాయం చేయడంలో మెగా కోడలకు అసలు ఎవరు సాటిలేరని చెప్పాలి.



ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్న ఉపాసన ఎంత మొత్తంలో సంపాదిస్తుంటారనే విషయం గురించి కూడా చాలా మంది కూడా సందేహం వ్యక్తం చేస్తుంటారు. అయితే పలు సర్వేల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే మెగా కోడలు ఉపాసన సంవత్సరానికి దాదాపు 30 కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం తెలుస్తోంది. ఇలా ఉపాసన భారీ మొత్తంలోనే సంపాదిస్తూ ఆ సంపాదనలోనే ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి చేత మంచి ప్రశంసలను ఆమె అందుకుంటున్నారు.ఇక భర్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి లాగానే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకోగా ఆచార్య సినిమాతో డిజాస్టర్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: