కోవిడ్ పరిస్థితులు ప్రారంభం కాకముందు కొంతవరకు బాగానే ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆతరువాత వరసపెట్టి వచ్చిన కోవిడ్ వేవస్ తో టాలీవుడ్ వేలకోట్లల్లో నష్టపోయింది. అయితే గతసంవత్సరం డిసెంబర్ లో విడుదలైన ‘అఖండ’ ‘పుష్ప’ మూవీలో సూపర్ హిట్ కావడంతో సూపర్ హిట్ కావడంతో తిరిగి ఇండస్ట్రీ నెమ్మదిగా గాడిలో పడుతోంది అని అనుకున్నారు అంతా.  



అయితే ఒమైక్రాన్ పరిస్థితులతో తిరిగి ఫిలిం ఇండస్ట్రీ అతలాకుతలం అయిన తరువాత నెమ్మదిగా పరిస్థితులు చక్కబడ్డాకా భారీ సినిమాలు అన్నీ క్యూ కట్టడం మొదలుపెట్టాయి. ఈపరిస్థితులలో ‘భీమ్లా నాయక్’ నుండి మొదలైన భారీ సినిమాల జాతరలో ఒక్క ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’ లకు తప్ప మరే భారీసినిమాలకు సరైన కలక్షన్స్ రాకపోవడానికి యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న రగడ అనిఅంటున్నారు.



ముఖ్యంగా ‘ఆచార్య’ మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడానికి జూనియర్ అభిమానులు పరోక్షంగా కారకులు అయ్యారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్ లు కలిసి నటించినప్పటికీ ఆమూవీలో ఎక్కువ పేరు రామ్ చరణ్ కు రావడం తారక్ అభిమానులు తట్టుకోలేకపోయారు అని అంటారు. దీనితో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న జూనియర్ అభిమానులు ‘ఆచార్య’ మూవీ ఫెయిల్ అయిందని తెలియగానే తెల్లవారుజాము నుండి ‘ఆచార్య’ మూవీ ఫెయిల్యూర్ టాక్ ను స్ప్రెడ్ చేయడంలో కీలకపాత్ర పోషించిన యాంటీ మెగా ఫ్యాన్స్ వర్గంలో తారక్ అభిమానులు కూడ తమ వంతు పాత్ర నిర్వర్తించారు అన్న గాసిప్పులు ఉన్నాయి.



ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘సర్కారు వారి పాట’ మూవీకి మొదటిరోజు మొదటి షో నుండి డివైడ్ టాక్ రావడం వెనుక యాంటీ మహేష్ ఫ్యాన్స్ వర్గాలు ఉన్నాయి అన్నప్రచారం కూడ జరుగుతోంది. వాస్తవానికి మహేష్ వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ ‘సర్కారు వారి పాట’ విడుదలకు ముందు నుంచి మహేష్ చేసిన కామెంట్స్ ఎదో ఒక వివాదానికి తావిస్తూనే ఉన్నాయి. ఇలా టాప్ హీరోల సంఖ్య కంటే వారి యాంటీ ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువైపోతు ఉండటంతో ఈ యాంటీ ఫ్యాన్స్ రగడలో ‘ఆచార్య’ ‘సర్కారు వారి పాట’ లాంటి భారీ సినిమాలు నలిగిపోయాయి అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: