మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ నుండి సినిమా వస్తుంది అంటే కేవలం ఆయన ఫ్యాన్స్ లో మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉంటాయి. హీరోగా తొలిసారిగా రాజకుమారుడు మూవీ తోనే పెద్ద విజయం అందుకున్న మహేష్ బాబు, అక్కడి నుండి కెరీర్ పరంగా ఆడియన్స్, ఫ్యాన్స్ లో తన సినిమాలతో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు తిరుగులేని సూపర్ స్టార్ గా విపరీతమైన క్రేజ్ తో దూసుకెళ్తున్న మహేష్ లేటెస్ట్ గా చేసిన సినిమా సర్కారు వారి పాట.

ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకున్న మహేష్ కి సర్కారు వారి పాట రూపంలో మరొక సక్సెస్ వచ్చి చేరి ఆయనకి మరింత పేరు తెచ్చిపెట్టింద . అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా ప్రీమియర్స్ తో పాటు సోషల్ మీడియా  మాధ్యమాల్లో అక్కడక్కడా కొంత నెగటివ్ ట్రెండ్ నడిచింది. అయితే మహేష్ సినిమాలకు ఇదంతా కామన్ అని నిజానికి సినిమాలో విషయం ఉంటె, మహేష్ బాబు చరిష్మా గతంలో ఆయనకి మంచి కలెక్షన్స్ ని సూపర్ హిట్స్ ని అందించిందని, అలానే ప్రస్తుతం నెగటివిటీ ని లెక్కచేయకుండా మహేష్ స్టార్డం తో ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీకి ఆడియన్స్, ఫ్యాన్స్ క్యూలు కడుతున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు.

ఇప్పటికే సర్కారు వారి పాట రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 103 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. రేపు ఆదివారం కావడంతో మూవీ మరింతగా అదరగొట్టే ఛాన్స్ ఉందని, అయితే సోమవారం నుండి సర్కారు వారి పాట కి అసలైన పరీక్ష మొదలవుతుందని, కాగా ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని టాక్ ని బట్టి చూస్తే సోమవారం నుండి కూడా మంచి కలెక్షన్ అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: