ఒక సినిమా విజయం లేదా పజయం అనేది ఒకప్పుడు మరియు ఇప్పటికీ చాలా మారుతూ వచ్చింది. గతంలో ఒక సినిమా రిలీజ్ అయితే ఎక్కువ కాలం థియేటర్ లో ఆడుతూ ఉండేది. తద్వారా నిలకడగా కలెక్షన్స్ వచ్చేవి. అలా ఆ సినిమా ఫలితాన్ని నిర్ణయించే వారు.. కానీ ఇప్పుడు కలం పూర్తిగా మారింది... ఒక వారానికి పది సినెమాల్కాపైగా రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఒకవేళ రెండు మూడు పెద్ద సినిమాలు వస్తే చాలు ఒక చిన్న సినిమాలు బ్రతకడం కష్టం. ఆలా వచ్చిన సినిమాలు మొదటి రెండు మూడు రోజులకు మంచి కలెక్షన్ లు సాధించి హిట్ సినిమాలుగా నిలుస్తున్నాయి. అయితే ఈ రెండు మూడు రోజులలో కనుక మంచి ఓపెనింగ్స్ రాకపోతే ఆ సినిమా వేస్ట్ అని లెక్క. అయితే అలా మంచి ఓపెనింగ్స్ రాబట్టాలంటే ఏ విధమైన సూత్రాలను పాటిస్తున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం.

పెద్ద సినిమా రిలీజ్ సమయానికి మరే చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా మంచి టైమింగ్ కోసం జాగ్రత్త పడతారు. అలా మంచి సమయానికి సినిమాను రిలీజ్ చేస్తారు. అంతే కాదు.. థియేటర్ లో టికెట్ ధరలను భారీగా పెంచుకుంటారు, మొదటి వారం రోజులు బెనిఫిట్ షో లకు ప్రభుత్వాల నుండి అదనపు అనుమతి తీసుకుంటారు. అంతే కాకుండా ఎక్కువ థియేటర్ లను కూడా తీసుకుంటారు, ఇన్ని ప్రయోగాలు చేసి సినిమా వసూళ్లు బాగా సాధించి తాము ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ రాబట్టుకోవడానికి చూస్తారు. ఆ తరువాత వచ్చే కలెక్షన్ లు హిట్ లేదా ప్లాప్ అని డిసైడ్ చేస్తారు.

ఇది ఒక సినిమా సక్సెస్ అవడానికి ఫార్ములా ? ఇదే ఫార్ములాను రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్ మరియు ఆచార్య లకు అప్ప్లై చేశారు. మరి ముందు ముందు రానున్న సినిమాలకు డే ఫార్ములాను పెట్టి సక్సెస్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది. అయినా కూడా రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: