హీరో రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం క్రాక్ ప్రతి ఒక్కరికి గుర్తు ఉండనే ఉంటుంది.. ఎందుకంటే ఈ చిత్రం కరోనా తర్వాత విడుదలైన మొదటి చిత్రం. ఈ సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజక్రాక్ చిత్రం ఒక సాలిడ్ సక్సెస్ ను అందించింది. మరొకసారి పోలీస్ పాత్రలో రవితేజ అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ శృతి హాసన్ నటించిన ది. ఈ చిత్రంతోనే కంబ్యాక్ ఇచ్చింది హీరోయిన్ శృతిహాసన్.

ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం..క్రాక్ సినిమా కథ తనదే అంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించినట్లు గా సమాచారం అందుతోంది ఈ సినిమా కథ తనదే అంటే సికింద్రాబాద్ లో ఆల్వాల్ లో ఉండే శివ సుబ్రహ్మణ్య మూర్తి అనే ఒక రచయిత హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.


బల్లెం చిత్రం మీడియా డైరెక్టరీ అనే పుస్తకంలో కొన్ని సన్నివేశాలను తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాలని అతడు ఆరోపిస్తున్నాడు. బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే ఒక పుస్తకాన్ని ఆయన రచించాడు అని తన పుస్తకం లోని సన్నివేశాలను కాపీ కొట్టి క్రాక్ సినిమాలు రూపొందించారని శివసుబ్రమణ్యం మూర్తి తెలియజేయడం జరిగింది. ఫిలించాంబర్ నుంచి నోటీసులు పంపించిన ఎవరు స్పందించలేదని దీంతో పోలీసులు ఆశ్రయించానని తెలియజేశారు. ఇక గతంలో కూడా క్రాక్ చిత్రంపై పలు వివాదాలు కూడా తలెత్తుతాయి. దీంతో తనకు ఇవ్వాల్సిన 12 లక్షలు బ్యాలెన్స్ అమౌంట్ కూడా నిర్మాత ఠాగూర్ మధు ఇవ్వడం లేదని తెలియజేశారు. మరి ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: