తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. తొలిసారిగా టాలీవుడ్ కి సూపర్ మూవీ తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనుష్క, ఆ తరువాత వరుసగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో పలు అవకాశాలు అందుకున్నారు. ఆ తరువాత దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన అరుంధతి సినిమాతో హీరోయిన్ గా పెద్ద పేరు దక్కించుకున్నారు అనుష్క.

ఆ సినిమాలో ఆమె నటనకి మంచి పేరు దక్కడంతో పాటు మూవీ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అక్కడి నుండి పలువురు స్టార్ హీరోల సరసన మరింతగా ఛాన్స్ లు అందుకున్న అనుష్క ఆయా సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ తో రాజమౌళి తీసిన బాహుబలి రెండు సినిమాల్లో దేవసేన పాత్ర చేసి తన అందం, అభినయంతో అందరినీ అలరించి మరింతగా క్రేజ్ అందుకున్న అనుష్క, ఆపైన భాగమతి మూవీతో మరొక విజయం అందుకున్నారు.

అయితే ఆ తరువాత చేసిన నిశ్శబ్దం తో పెద్ద సక్సెస్ అందుకోలేకపోయిన అనుష్క, అక్కడి నుండి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ తీసుకున్నారు. ఇక త్వరలో నవీన్ పోలిశెట్టి తో యువ దర్శకుడు మహేష్ తో ఒక సినిమా చేయనున్నారు అనుష్క. అయితే ఆమె కెరీర్ పరంగా కొంత ఆలోచన చేస్తున్నారని, మంచి స్క్రిప్ట్ దొరికితే చేయడానికి తాను సిద్ధం అని, కానీ ఇటీవల తాను ఆశించిన స్థాయిలో స్క్రిప్ట్స్ రాకపోవడంతోనే ఆమె బ్రేక్ తీసుకున్నారని ఇన్నర్ వర్గాల సమాచారం. ఇక రెండు రోజుల క్రితం ఆమె ఒక భారీ మూవీ ఓకె చేసారని, త్వరలో దానికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుందని టాక్. మరి ఇదే కనుక నిజం అయితే అనుష్క శెట్టి ఫ్యాన్స్ కి ఇది మంచి గుడ్ న్యూస్ అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: