కృష్ణ గాడి వీర ప్రేమ కథ చిత్రం తో మొదటిసారిగా హీరోయిన్ గా పరిచయం అయింది హీరోయిన్ మెహ్రీన్. తెలుగులో మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది మెహ్రీన్. భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు రాకుండా వచ్చిన సినిమా లోనే మంచి సక్సెస్ను అందుకుంటూ మీడియం రేంజ్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం యువ హీరోలతో నటించే అవకాశాలను కూడా బాగా దక్కించుకుంటోంది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, తన సొంత భాష అయిన పంజాబీ, కన్నడ వంటి భాషలలో కూడా నటిస్తూ ఉంటోంది.


కానీ ఇప్పటి వరకు స్టార్ డమ్ అనేది మెహ్రీన్ కు దక్కడం లేదని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత.. స్టార్డం వస్తుందని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ కాని ఆమె నటించిన ప్రతి సినిమా కూడా అలాగే ఉంటుంది తప్ప మార్పులేదు.. అయితే ఈమె నటించిన ఎఫ్2 చిత్రం మాత్రం భారీ విజయాన్ని చేసుకున్నప్పటికీ.. స్టార్ హీరోల సరసన మాత్రమే నటించేందుకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు తాజాగా f-3 సినిమాలతో మెహరీన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.


ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అవుతుందనే నమ్మకం పెట్టుకుంది మెహ్రీన్. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా మంచి పేరు వస్తే మరింత కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ చిత్రం తప్ప ఏమీ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు కానీ ఒక కన్నడ సినిమాలో మాత్రం నటిస్తోంది. F-3  సినిమాలకు ముందు ఈమె నటించిన అన్ని సినిమాలు నిరాశపరిచాయి. మంచిరోజులు వచ్చాయి చిత్రం కూడా ఈమెకు నిరాశ మిగిల్చింది దీంతో.. ఈమె ఆశలన్నీ ఎఫ్ త్రీ సినిమా పైన పెట్టుకున్నది. ఇందులో వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా వంటివారు కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: