టాలీవుడ్ నటులలో ఒకరు అయిన సునీల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సునీల్ కామెడీ పాత్రలతో తన కెరియర్ ను మొదలు పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అలా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్న సునీల్ ఆ తర్వాత  అందాల రాముడు, మర్యాద రామన్న వంటి పలు సినిమా లలో హీరోగా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకొన్నాడు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం సునీల్ సినిమా లలో హీరో పాత్రలలో నటిస్తున్న , తన కెరియర్ కు ఎంతో బుస్టింగ్ ని ఇచ్చిన కామెడీ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా సునీల్ ఎఫ్ 3 మూవీ లో కమెడియన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా సునీల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్  అనేక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.

తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ... పూర్తి స్థాయి కమెడియన్ గా చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ లో మీకు కనిపిస్తాను. మొదటి నుండి చివరి వరకు ఈ మూవీ లో నేను కనిపిస్తూనే ఉంటాను. వెంకటేష్ గారితో చింతకాయల రవి సినిమా తర్వాత మళ్లీ కలిసి పని చేశాను. ఆయన కామెడీ టైమింగ్ గురించి చెప్పనవసరం లేదు. డైలాగ్ తో పనిలేకుండా ఎక్స్ప్రెషన్స్ తోనే  ఆయన చంపేస్తారు.  ఇక వరుణ్ తేజ్ కూడా కామెడీ అదరగొడుతున్నాడు.  వీరితో కలిపి ఈ మూవీ లో నటించడం చాలా సంతోషంగా ఉంది అని తాజా ఇంటర్వ్యూ లో సునీల్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: