సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే, ఆ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంటూ ఉంటారు.

అలా మూవీ పై భారీ అంచనాలు ఉండటంతో ఆ సినిమాకు  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతూ ఉంటుంది.  అలాగే డిజిటల్ , సాటిలైట్,  మ్యూజిక్ హక్కుల రూపంలో  నిర్మాత లకు కోట్ల రూపాయలు వస్తాయి.  సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా అంటే ఏ ప్రొడ్యూసర్ కు అయినా ఆ అదృష్టం లాంటిదే.  సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ ప్రొడ్యూసర్ తో సినిమా తీస్తే , ఆ ప్రొడ్యూసర్ మహేష్ బాబు అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట'  సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే...  సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా కోసం 35 నుంచి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది.  ఈ వార్తను తెలుసుకున్న కొంత మంది సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ కి ఆ మాత్రం ఇచ్చుకోవాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: