భారతదేశంలోకి కారోనా ఎంటర్ అవ్వక ముందు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లను చాలా తక్కువ మంది ఉపయోగించేవారు.  ఎప్పుడైతే ఇండియా లోకి కారోనా ఎంటర్ అయిందో అప్పటి నుండి ఇండియా లో  'ఓ టి టి'  ప్లాట్ ఫామ్ ల వాడకం చాలా వరకు పెరిగిపోయింది. అలా ఇండియా లోకి కారోనా ఎంటర్ అయిన తర్వాత 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ల వినియోగం పెరగడానికి ప్రధాన కారణం... ప్రభుత్వాలు కరోనా ప్రభావం వల్ల కొన్ని రోజుల పాటు థియేటర్ లపై ఆంక్షలను విధించడం.

అలాగే కారోనా కేసులు ఉధృతం అయిన నేపథ్యంలో థియేటర్ లను కొన్ని రోజుల పాటు పూర్తిగా మూసి వేయడంతో సినీ ప్రేమికులకు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లు ప్రధాన దిక్కుగా మారాయి. దానితో  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోయినా సినీ ప్రేమికులు ప్రస్తుతం కూడా 'ఓ టి టి' లో సినిమాలను చూడడానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కొన్ని సినిమాలు నేరుగా 'ఓ టి టి' లో విడుదల అవుతూ ఉంటే...  మరి కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన అటాక్: పార్ట్-1 మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతుంది.  లక్ష్య రాజ్ ఆనంద్  దర్శకత్వం వహించిన అటాక్: పార్ట్-1’ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , రకుల్ ప్రీత్ సింగ్  కీలక పాత్రలు పోషించారు. అటాక్: పార్ట్-1’ మే 27 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్  ‘జీ-5’ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ 'ఓ టి టి' సంస్థ  ‘జీ-5’ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: