టాలీవుడ్ ఇండస్ట్రీ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరు అయిన కొరటాల శివ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మిర్చి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న కొరటాల శివ ఆవతర్వాత శ్రీ మంతుడు, జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలకు దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలను సాధించాయి.

అలా వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు గా ఉన్న కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయం నుండి విడుదల వరకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29 వ తేదీన ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయ్యింది.  భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఆచార్య సినిమా విడుదల అయిన మొదటి షో నుండి నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. విడుదల అయిన మొదటి షో నుండే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ నెగిటివ్ టాక్ ప్రభావం ఆచార్య సినిమా కలెక్షన్ల పై తీవ్రంగా పడింది.

దానితో ఆచార్య సినిమాకు మొదటి రోజు మినహాయిస్తే ఆ తర్వాత రోజు నుండి కలెక్షన్లు అతి తక్కువగా నమోదు అవుతూ వచ్చాయి. దీనితో ఆచార్య సినిమాను కొన్న బయ్యర్ లకు,  డిస్ట్రిబ్యూటర్ లకు తీవ్రమైన నష్టాలు వచ్చాయి.  దానితో కొరటాల శివ 'ఆచార్య' సినిమాను కొన్న బయ్యర్ లకు,  డిస్ట్రిబ్యూటర్ లకు పాతిక కోట్లు తిరిగి వెనక్కి ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇలా ఆచార్య సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్ లకు ,  డిస్ట్రిబ్యూటర్ లకు కొరటాల శివ సహాయం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: