ప్రస్తుతం
శంకర్ దర్శకత్వంలో ఓ భారీ
సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చరణ్ తన పూర్తి శ్రద్ధను ఆ చిత్రంపైనే ఉంచుతున్నాడు. ఆ
సినిమా ద్వారా ఎలాగైనా దేశ వ్యాప్తంగా తనకు వచ్చిన గుర్తింపును రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ఆ సినిమాని ఎవరూ ఊహించని విధంగా చేయాలని దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు.
ఈ చిత్రం తర్వాత కూడా ఆయన
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
సినిమా చేయడం అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చరణ్ మంచి దర్శకులతో సినిమాలు అయితే ఓకే చేసుకుంటున్నాడు కానీ హిట్ కొట్టి విషయంలో కొంత వెనుకబడి పోతున్నాడు అనే వాదన ఎప్పటి నుంచో
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొనసాగు తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెంటిమెంట్ ను కాదని చేస్తున్న ఈ సినిమాలు ఏ స్థాయిలో ఆయనకు విజయాన్ని తెచ్చి పెడతాయో చూడాలి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో కూడా ఓ చిత్రాన్ని త్వరలోనే చేయబోతున్నాడు
రామ్ చరణ్. ఇది ఎంతో వెరైటీ చిత్రం గా తెరకేక్కుతుందని అంటున్నారు.నేషనల్ అవార్డు అందుకున్న ఈ దర్శకుడు
రామ్ చరణ్ తో ఎలాంటి
సినిమా చేస్తాడో చూడాలి.