రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది వారియర్. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ భాగం పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయాలని యూనిట్ భావిస్తూ ఉండగా సినిమాపై క్రేజ్ పెంచే విధంగా ఒక్కొక్క అప్డేట్ ను చిత్రబృందం విడుదల చేస్తుంది. ఇప్పటికే పలు ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా తాజాగా టీజర్ ను విడుదల చేసింది.

సినిమా యొక్క టీజర్ అందరినీ ఎంతగానో ఆసక్తి పరిచింది అని చెప్పాలి. రామ్ ను సరికొత్త మేక్ అవర్ లో చూపించిన సినిమాగా దీన్ని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా పోలీస్ పాత్రలో నటించక పోవడమే ఈ సినిమాపై ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం అని చెప్పాలి. ఈ చిత్రం లో పోలీసాఫీసర్ గా రామ్ నటన అదిరిపోయిందని చెప్పవచ్చు. రామ్ అభిమానులు అయితే ఈ సినిమాలో తమ హీరో అదరగొట్టాడని చెప్పుకుంటున్నారు. ఇంకా విడుదల కాకముందే ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని కూడా వారు చెబుతున్నారు. 

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి కం బ్యాక్ చేసి హిట్ జోష్ లో ఉన్న ఈ హీరో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో అంతకు మించిన విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో రాబోతున్న ఈ తొలి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: