సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నోళ్ళలో సినిమా విశ్లేషకుల చర్చలలో హీరోలు భాగం అవుతూ ఉండాలి. అప్పుడే సదరు హీరోకు ఎక్కువ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. అంతే కాదు ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సినిమా సినిమాకి గ్యాప్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా నిత్యం ఎంటర్టైన్ చేయాలి. అప్పుడే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ కు బ్యాడ్ డేస్ ఎదురవుతున్నాయి అని చెప్పాలి.

కారణం ఏదైనా కూడా ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో ఎందుకో వెనకబడ్డాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా నాలు గు సంవత్సరాలుగా చేస్తున్నాడు. అది తప్ప వేరే ప్రాజెక్టు ఏది కూడా ముందుకు రాలేదు. ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. రాజమౌళితో సినిమా అంటే చాలా సమయం తీసుకుంటుంది. ఈసారి కరోనా రావడం తో మరింత ఆలస్యం అయ్యింది. అలా ఈ చిత్రం సకాలం లో ఈ చిత్రం విడుదల కాకుండా పోయింది. 

అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమా లో నటించిన మరొక హీరో రామ్ చరణ్ ఈ చిత్రంలో నటించిన కూడా తదుపరి సినిమాలను ఓకే చేసుకునే విషయం లో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఏకంగా రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటో ఎవరికీ తెలియడం లేదు. జూన్ ఒకటో తేదీ నుంచి కొరటాల శివ సినిమా మొదలు కాబోతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఎన్టీఆర్ తన చిత్రాన్ని మొదలుపెట్టి అభిమానుల కోరిక తీర్చా లని కొంత మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకొకవైపు బుజ్జి బాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ గ్రామాన్ని కూడా త్వరలోనే మొదలు పెట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: