నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మసాలా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్వహించని ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటోంది. క్రాక్ సినిమాతో ఘన విజయం అందుకున్న దర్శకుడు అయిన గోపీచంద్ మలినేని చాలా రోజులుగా బాలకృష్ణ తో చేయబోయే సినిమా యొక్క కథపై కసరత్తులు చేశాడు. ఈ చిత్రం కూడా బాలకృష్ణ అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించే విధంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యం లో బాలకృష్ణకు సినిమాల పరంగా అన్ని కలిసి వస్తున్నాయి అని చెప్పాలి బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమా వారిద్దరికీ మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది అంతేకాదు హ్యాట్రిక్ విజయాన్ని తెచ్చిపెట్టి వీరి కాంబినేషన్ కి తిరుగులేదు అని మరొకసారి ఆ సినిమా నిరూపించింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో మొదలుపెట్టిన బాలకృష్ణకు ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

ఈ చిత్రం తర్వాత కూడా బాలకృష్ణ కొంత మంది దర్శకులతో సినిమాలు ఒకే చేస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ సిని మా ఓకే చేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. చాలా బ్రో తర్వాత హిట్ ట్రాక్ లోకి వచ్చిన బాలకృష్ణకు ఇప్పు డు ఇవన్నీ కలిసొచ్చే అంశాలే అనే చెప్పాలి ఇతర సీనియర్ హీరోలు బాలకృష్ణ కంటే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ పోతుంటే బాలకృష్ణ మాత్రం నెమ్మదిగా సినిమాలు తీసుకుం టూ వారి ద్వారా భారీ స్థాయిలో విజయాలు అందుకుంటున్నాడు.ఏదేమైనా సీనియర్ హీరో లు ఈ స్థాయి లో రాణించడం నిజంగా టా లీవుడ్ కి మంచి పరిణామం అని చెప్పా లి. 

మరింత సమాచారం తెలుసుకోండి: