గతంలో సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లు హైలైట్ అవుతూ వుంటారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది.

సినిమాలు చేసినా.. చేయకున్నా దీని ద్వారా చాలా మంది భామలు నిత్యం కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ అయిన సోనాల్ చౌహాన్ ఒకరు. సినిమాల్లోకి చాలా కాలం క్రితమే వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ బాగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సుదీర్ఘ కాలంగా బాగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ చౌహాన్ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.


 
చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో మాయ చేసే సోనాల్ చౌహాన్ చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందట.. అక్కడ తన అందంతో అందరి దృష్టినీ కూడా ఆకర్షించింది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించిందట.. అలాగే అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం టైటిల్ ను ఆమె గెలిచింది.
 

మోడల్‌గా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన సమయంలోనే సోనాల్ చౌహాన్‌కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుందట.. చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో యాక్టింగ్ మాత్రమే కాకుండా.. గ్లామర్ పరంగానూ ఆమె అలరించింది.

 

'జన్నత్' మూవీలో నటించిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు చాలా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు బాగా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును అయితే ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో కూడా గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్ పెంచుకుంది.
 

ఈ మధ్య కాలంలో తెలుగులో సోనాల్ చౌహాన్ కొన్ని సినిమాల్లో నటించింది. 'రెయిన్‌బో' నుంచి వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాలు ఆమె చేసింది. అందులో మూడు సినిమాలు నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు 'F3'తో పాటు పలు సినిమాలు కూడా చేసేసింది.
 

సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం కూడా టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తోంది.
 

చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుని చూస్తే సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోందట . ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు కూడా వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్సే ఉంటాయట.అందులోనూ బికినీ ధరించిన ఫొటోలు కూడా సోనాల్ పోస్ట్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ ఇంటర్నెట్‌నే బాగా షేక్ చేసి పడేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: