కోలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ కార్తికేయన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రేమో సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రేమో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న శివ కార్తికేయన్ ఆ తర్వాత తాను కోలీవుడ్ లో నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అందులో భాగంగా తాజాగా కోలీవుడ్ లో  శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమాను వరుణ్ డాక్టర్ పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.

తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది.  డాక్టర్ వరుణ్  సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న శివ కార్తికేయన్ మరో సారి కాలేజ్ డాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాలేజ్ డాన్ సినిమా తమిళ్ మరియు తెలుగులో ఒకే రోజు విడుదల అయ్యింది. సీబీ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది.  విడుదల అయిన మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకున్న కాలేజ్ డాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు రెండు రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కాలేజ్ డాన్ సినిమా తమిళనాడు లో మొదటి రోజు 9 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా,  రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.  

ఇకపోతే కాలేజ్ డాన్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 20 లక్షల  గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయగా,  రెండో రోజు 30 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించింది.  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్ డాన్ సినిమా రెండు రోజులకీ గాను 50 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.  మొత్తం మీద శివకార్తికేయన్ హీరో గా నటించిన కాలేజ్ డాన్ మూవీ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల గ్రాస్ కలెక్షన్ల ను అందుకుని ఉంటుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: