కరాటే కళ్యాణి మరియు యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య గొడవ కాస్త పెద్దదిగా మారుతోందని చెప్పవచ్చు. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా ద్వారా ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు.. శ్రీకాంత్ మాట్లాడుతూ.. నేను చేసేది ఫ్రాంక్ వీడియోలు కనుక కరాటే కల్యాణి కి డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకోవాల అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ నేను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనను కొట్టిందని ఆరోపించారు శ్రీకాంత్. ఈ విషయంపై శ్రీకాంత్ ఇప్పటికే కేసు నమోదు చేయించారు.

కరాటే కళ్యాణి కూడా కేసు పెట్టడంతో ఇక్కడితో ఈ విషయం పూర్తి అయినది అనుకున్నారు కానీ కరాటే కళ్యాణి ఎపిసోడ్ ప్రతి రోజు అలా అలా పెరుగుతూనే ఉన్నది.. SR నగర్ లో ఉండే పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ కరాటే కళ్యాణి లు కేస్ పెట్టుకోవడం జరిగింది. ఇక వీరిద్దరి మీద ఒకే రకమైన కేసులు పెట్టడంతో ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక మహిళ పెట్టిన కేసు విషయంలో సిఐ సైదులు అలసత్వం ప్రదర్శిస్తున్న ట్లుగా సమాచారం అందుతోంది. ఇద్దరిపై ఒకేరకమైన కేసులు ఎలా పెడతారని సిఐ తీరును పోలీస్స్టేషన్ విమర్శిస్తోంది.

దీంతో ఆమెను పోలీసులు బలవంతంగా బయటికి పంపించడంతో వారిపై కూడా కేసు పెడతానని హెచ్చరించింది. ఇక గతంలో కూడా కరాటే కళ్యాణి ఒక రేప్ కేసు విషయంలో కూడా బాధితురాలు తమకు సంబంధించిన వాటిని మీడియాకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆ అమ్మాయిని  చంపేస్తానని హెచ్చరించింది అట కళ్యాణి. దీంతో ఆ బాధితులు ఇప్పుడు కరాటే కళ్యాణి నేనంటే తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్స్టేషన్లో కేసు వేయడం జరిగింది. ఈ కేసులు కాకుండా.. ఈమె పై చీటింగ్ కేసు, ఒక ప్రాపర్టీ విషయంలో కూడా మోసం చేసిన వాటిపై కూడా ఈమె కేసు వేయడం జరిగింది. ఇక రాబోయే రోజులలో ఎన్ని కేసులు వస్తాయి తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: