తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుపొందిన డి.ఇమ్మాన్ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అతని సన్నిహితులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక వారితో పాటుగా నటి సంగీత, సీనియర్ నటీమణి కుట్టి పద్మిని, తదితర సింగర్స్ వీరి వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. కాగా ఇమ్మాన్ 2008 లో కంప్యూటర్ ఇంజనీర్ గా పని చేసే మౌనిక రీఛార్డ్ ని వివాహం చేసుకున్నాడు.


వీరిద్దరికీ ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. వారి పేర్లు వేరోనికా డోరతి ఇమ్మాన్, బ్లేస్సికా కలరు. అనూహ్యంగా వీరి 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు.ఇమ్మాన్, మౌనిక రీఛార్డ్ 2021 డిసెంబర్ 29న వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు గా ప్రకటించడం జరిగింది. కాగా విడాకుల తర్వాత వీరు  జీవితంలో మరొక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గా ఇటీవల ఒక పోస్ట్ చేయడం కూడా జరిగింది ఇమ్మాన్. దీంతో అతను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు బాగా వినిపించాయి.అయితే అప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ రెండో వివాహం చేసుకున్నాడు. 2002 న విజయ్, ప్రియాంక చోప్రా నటించిన తమిజన్ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారిన ఇమ్మాన్ పలు సక్సెస్ఫుల్ సినిమాలకు స్వరాలు అందించారు. ఇక తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు స్వరాలు కూడా సమర్పించారు. అజిత్ హీరోగా నటించిన విశ్వాసం చిత్రానికిగాను జాతీయ అవార్డును సంపాదించుకున్నారు. ఇక వీటితో పాటుగా పలు చిత్రాలకు స్వరాలు అందించారు ఇమ్మాన్. ప్రస్తుతం ఈ సంగీత దర్శకునికి సంబంధించి కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత కాలంలో రెండో వివాహం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: