నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కెరియర్ పరంగా బాలకృష్ణ కు 107 వ సినిమా. ఆ కారణంగా బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో దునియా విజయ్ కనిపించబోతున్నాడు.  

అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతుంది.  ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు నుండి ఎన్ బి కె 107 సినిమా లోని ఐటమ్ సాంగ్ చిత్రీకరణను  చిత్ర బృందం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ ఐటం సాంగ్ షూటింగ్ ఈ రోజు అనగా మే 16 వ తేదీ నుండి మే 20 వ తేదీ వరకు జరగనున్నట్లు సమాచారం.  

ఈ ఐటమ్ సాంగ్ లో బాలకృష్ణ తో డింపుల్ హయాతి నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖిలాడి సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా నటించి తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న డింపుల్ హయాతి ఈ సాంగ్ లో కూడా తన అందచందాలతో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తుంది.  అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: