దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవగన్, శ్రేయ , సముద్ర కని ముఖ్య ప్రధాన పాత్రధారులుగా , ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో , డి.వి.వి.దానయ్య నిర్మాతగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర 1100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన ఈ సినిమా మే 20 వ తేదీ నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ 'ఓ టి టి' సంస్థ జీ 5 లో టెలికాస్ట్ కాబోతుంది.

కాకపోతే జీ 5 సబ్స్క్రిప్షన్ ఉన్నవారు కూడా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను చూడాలి అంటే కొంత డబ్బులు చెల్లించవలసి ఉంది.  అలా పే ఫర్ వ్యూ అనే పద్ధతిలో 'ఆర్ ఆర్ ఆర్'  సినిమాను జీ 5 'ఓ టి టి'  ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది.  ఇది ఇలా ఉంటే 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఫార్ములానే 'కే జి ఎఫ్ చాప్టర్ 2' కూడా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. యాష్ హీరోగా  శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14 వ తేదీన భారీ అంచనాలతో విడుదలైంది.

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించింది. 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో మే 27 వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో పే ఫర్ వ్యూ పద్దతిలో  ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.  ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: