టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ హీరోగా దశాబ్దాల పాటు కెరీర్ ను కొనసాగించిన సీనియర్ హీరో జగపతిబాబు సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. కుటుంబ కథా సినిమాలలో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన ఈ హీరో ఆ ప్రయోగాలతో ఎక్కువసార్లు ఎన్నో విజయాలను అందుకున్నారు.ఆయన తన తల్లి కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న జగపతి బాబు తర్వాత కాలంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.జగపతిబాబు నటించిన మొదటి సినిమా సింహస్వప్నం కాగా ఆ సినిమాలో జగపతిబాబు ఇక డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించడం గమనార్హం.ఆ తర్వాత పలు కుటుంబ కథా సినిమాలలో నటించిన జగపతిబాబు గాయం సినిమాతో ఫస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. జగపతిబాబు నటించిన శుభలగ్నం మంచి హిట్ ని సొంతం చేసుకోవడంతో ఈ నటుడు కుటుంబ కథా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.



శుభలగ్నం సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్టర్ కాగా ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు కూడా తెరకెక్కాయి. తర్వాత రోజుల్లో జగపతిబాబుకు ఇక మహిళా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా పెరిగింది. అయితే జగపతిబాబు తన కూతురికి అమెరికా అబ్బాయిని అల్లుడిగా చేసుకున్నారనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం కావడం గమనార్హం.ఇక జగపతిబాబు పెద్ద కుమార్తె మేఘన 2015లో చాక్ బోవిన్ అనే అమెరికన్ ను వివాహం చేసుకున్నారు. మేఘన అమెరికాలో పీజీ చదువుతున్న టైంలో బోవిన్ తో ప్రేమలో పడిందని కూతురు ప్రేమకు జగపతిబాబు అడ్డు చెప్పలేదని సమాచారం తెలిసింది. హైదరాబాద్ లో జగపతిబాబు కూతురు వివాహం చాలా ఘనంగా జరిగింది. ప్రస్తుతం విలన్ గా ఇంకా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: