పూర్ణ..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..హార్రర్ సినిమాలను తెరకెక్కిస్తూరు. అయితే ఈ అమ్మడు చేసింది కొన్ని సినిమాలు అయిన కూడా రచ్చ మాత్రం మాములుగా ఉండదు.తెలుగులో శ్రీ మహాలక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా, ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అల్లరి నరేశ్ సీమ టపాకాయ్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రవిబాబు డైరెక్షన్ లో వచ్చన అవును సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది .


ఈ మళయాల బ్యూటీ. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తోంది.ఇటీవల బాలయ్య నటించిన సక్సెస్ మూవీ అఖండ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించింది.రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన లడ్డు బాబు, నువ్వలా నేనిలా సినిమాల్లో కూడా నటించింది.అలాగే బాలీవుడ్ బ్యూటీ కంగనా నటించిన తలైవి లో జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో కనిపించింది. ఈ మధ్య కాలంలో పూర్ణ ప్రధాన పాత్రలో సుందరి చిత్రంలో నటించింది. కాగా ఓటీటీలో రిలీజైన త్రీ రోజెస్ మూవీలో కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది.



 కేరళలో పుట్టిన ఈ బొద్దుగుమ్మ అక్కడే చదువు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం పూర్ణ బుల్లితెర షోల తో బిజీగా ఉంది. ఢీ డ్యాన్స్ షోలో జడ్జిగా చేస్తోంది. అలాగే పలు స్పెషల్ ఈవెంట్స్ లో మెరుస్తోంది. అప్పుడప్పుడూ జబర్ధస్త్ షోలో కూడా జడ్జిగా కనిపిస్తోంది. అయితే సినిమాల్లోకి రాకముందు పూర్ణ ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. కాగా పూర్ణ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చెస్తుంది.. మొత్తానికి ఆ వీడియో పై లైవ్ కామెంట్స్ కూడా అందుకుంటుంది. ఇక పూర్ణ చేస్తున్న సినిమాలు కూడా హర్రర్ కథతో ఉన్నాయి. ఎదో రకంగా పూర్ణ ఆడియన్స్ కు దగ్గర అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: