కీర్తి సురేష్ గ్లామర్ షోకు చాల దూరంగా ఉంటుంది. కోలీవుడ్ టాప్ హీరోల సినిమాలలో ఆమెకు నటించే అవకాశం వచ్చినప్పుడల్లా తాను గ్లామర్ పాత్రలు చేయనని నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తాను అని చెప్పడం ఆమె అలవాటు. అయితే ఈనీతి నిబంధనలు అన్నీ ‘సర్కారు వారి పాట విషయంలో ఏమైపోయాయి అంటూ ఆమెను కోలీవుడ్ మీడియా విమర్శిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.

 

 
వాస్తవానికి ‘సర్కారు వారి పాట’ మూవీలో కీర్తి పాత్రను ఏగ్లామర్ హీరోయిన్ అయినా చేయగలుగుతుంది. దీనికోసం మహానటి ప్రత్యేకంగా ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఏసినిమాలోను కనిపించని విధంగా ఈసినిమాలో గ్లామర్ గా కనిపించడం కోసం నానాపాట్లు పడింది. కొంతమేరకు ఎక్స్ పోజింగ్ కూడ చేసింది. అయితే మహేష్ పక్కన ఆమె నటిస్తున్నంత సేపు సగటు ప్రేక్షకుడు మహేష్ అందాన్ని చూశారు కానీ కీర్తి గ్లామర్ ను అంతగా పట్టించుకోలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.

 

 ఇది ఇలా ఉండగా కీర్తి తన పెదవులు అందంగా కనిపించడానికి కాస్మటిక్ సర్జరీ చేయించుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గ్లామర్ హీరోయిన్స్ చాలామంది తాము అందంగా కనిపించడానికి ఇలాంటి కాస్మటిక్ సర్జరీలు చేయించుకోవడం పరిపాటి. శృతి హాసన్ ఇలాంటి సర్జరీ చేయించుకున్న తరువాత ఆమె మొఖంలో గ్లో తప్పింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.

 

 
వాస్తవానికి గ్లామర్ హీరోయిన్స్ మధ్య తాను నిలబడటానికి ఇలాంటి ప్రయత్నాలు కీర్తి చేస్తోంది అనుకోవాలి. అయితే ‘సర్కారు వారి పాట’ లో ఆమె గ్లామర్ కు పెద్దగా యూత్ ఫిదా అవ్వకపోవడంతో కీర్తి ఒకమెట్టు దిగినప్పటికీ ఫలితం ఉంటుందా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. మహేష్ కీర్తిల కాంబినేషన్ బాగుంది అని కామెంట్స్ రావడంతో టాప్ హీరోలు తమ సినిమాలలో ఈమెకు ఏమ్తవర్కు అవకాశాలు ఇస్తారో చూడాలి. వాస్తవానికి ఇప్పటివరకు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపిన కీర్తి ఇక లాభం లేదనుకుని ఇలా గ్లామర్ బాట పట్టింది అనుకోవాలి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: