హీరో అఖిల్ నటిస్తున్న నాలుగు సినిమాలు కూడా కనీసం 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించలేదు.. కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మినహా మిగతా మూడు సినిమాలు బయ్యర్లకు ,నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని అఖిల్ కల. ప్రస్తుతం హీరో అఖిల్ దృష్టి అంతా ఎక్కువగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఏజెంట్ చిత్రంపైనే పెట్టుకున్నాడు. అఖిల్ ఈ చిత్రానికి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తూ ఉండడం గమనార్హం.

ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా మొదట ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా దర్శకత్వం వహించాలని అనుకున్నారట. ప్రస్తుతం ఈ విషయం పై తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు గా సమాచారం అందుతోంది. తన రెమ్యునరేషన్ని తనకు ఇచ్చేయాలని ఆయన కోరుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కరోనా వల్ల ఈ సినిమాపై బడ్జెట్ భారం పెరిగిపోయింది అని సమాచారం. అఖిల్ చేతిలో ప్రస్తుతం ఈ సినిమా మినహా మరొక సినిమా ఏది లేదని.. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రొడక్షన్ టీం కు మధ్య దూరం కాస్త పెరిగి పోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నాగార్జునసినిమా విషయంలో జోక్యం చేసుకుంటే మంచిదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమా విడుదల తేదీ సమయంలో కూడా పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అక్కినేని అఖిల్ కెరీర్ సజావుగా సాగడం లేదని ఆయన అభిమానులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏజెంట్ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే తప్ప ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సాధించడం చాలా కష్టం అని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరో అఖిల్ ఏజెంట్ సినిమా పైన తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇక సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న చిత్రం ఇదే..

మరింత సమాచారం తెలుసుకోండి: