ఈ సంవత్సరం హిందీ లో సౌత్ ఇండియా సినిమాల జోరు మామూలుగా లేదు. ఇప్పటి వరకు విడుదలైన చాలా సౌత్ ఇండియన్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేశాయి. అందులో భాగంగా 2022 వ సంవత్సరంలో విడుదలైన సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువ నెట్ కలెక్షన్లను హిందీ లో వసూలు చేసిన ఐదు సౌత్ ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన  కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా లో యాష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు 427.05 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.


ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు 273.06 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.


రాధే శ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ హిందీ బాక్సాఫీస్ దగ్గర 19.30 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా , ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు.


బీస్ట్ : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బీస్ట్  సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1.76 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా , ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.


వలిమై : అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వలిమై సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర 1.05 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: