అందాల ముద్దుగుమ్మ తాప్సీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాప్సి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఝుమ్మంది నాదం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో అనేక సినిమా అవకాశాలు దక్కించుకున్న తాప్సి కి ఒకటి , రెండు విజయాలు తప్పితే పెద్దగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాలు దక్కలేదు,  దానితో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపించిన తాప్సీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం,  అందులో భాగంగా తాప్సీ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో తాప్సి  క్రేజీ హీరోయిన్ గా  కెరియర్ ను సాగిస్తోంది.  

బాలీవుడ్ లో తాప్సీ నామ్‌ షబానా’, ‘ముల్క్‌’ ‘హసీనా దిల్‌రుబా’, ‘బద్లా’, ‘లూప్‌ లపేట’ వంటి విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కిన సినిమా లతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.  ఇలా నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న తాప్సీ 'ఔట్‌సైడర్స్‌ ఫిల్మ్స్‌'  అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, అందులో మూవీ లను నిర్మిస్తున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే.  

ఇది ఇలా ఉంటే తాప్సీ మరో అడుగు ముందుకు వేసి ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి కూడా మూవీ లను నిర్మించడానికి సిద్ధం అయ్యింది. తాప్సి అందులో భాగంగా వయోకామ్‌ 18 స్టూడియోస్‌, బీఎల్‌ఎమ్‌ పిక్చర్స్‌తో కలిసి ‘ధక్‌ ధక్‌’ మూవీ ని నిర్మిస్తునట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.  ఈ మేరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.  ఇలా తాప్సి మూవీలలో నటించడంతో పాటు మూవీలను నిర్మించడం లో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: