టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న మాస్ హీరో లలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరియర్  ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు,  విలన్ పాత్రలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రవితేజ , ఆ తర్వాత సినిమా లలో హీరో గా అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా రవితేజ నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం మరియు ఆ సినిమా లలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో  మోస్ట్ క్రేజీ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న రవితేజ కొన్ని సంవత్సరాల పాటు వరుస పరాజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు.  అలాంటి సమయం లోనే మాస్ మహారాజా రవితేజ  'క్రాక్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. క్రాక్ మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ కొన్ని నెలల క్రితం విడుదలైన ఖిలాడి సినిమాతో మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే  రవితేజ ప్రస్తుతం ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, రామారావు ఆన్ డ్యూటీ  అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.  

ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ రెమ్యునేషన్ సంబంధించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.  ఇంత కాలం పాటు 17 కోట్ల వరకు రెమ్యునరేషన్  తీసుకున్న రవితేజ ప్రస్తుతం దాదాపు మూడు కోట్ల రెమ్యూనరేషన్ పెంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  దానితో రవితేజ లాంటి స్టార్ హీరో ఉన్న సినిమాలకు ఆ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడం పెద్ద విషయమేమి కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: