ప్రస్తుతం సినీ ప్రేమికులు 'ఓ టి టి' లో సినిమాలు చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  అలా ప్రేక్షకులు సినిమాలను 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో చూపెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో 'ఓ టి టి' సంస్థలు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.  అందులో భాగంగా ఈ వారం కూడా కొన్ని సినిమాలు 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోతున్నాయి.  అలా ఈ వారం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం.

శేఖర్ : రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ సినిమా ఈ నెల 20 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు జీవిత దర్శకత్వం వహించింది.

 
ధగడ్ సాంబ : బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరో గా నటించిన 'ధగడ్ సాంబ' మూవీ ఈ నెల 20 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

 
ధాకడ్ : కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన ధాకడ్ మూవీ ఈ నెల 20 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.


భూల్ భులయ్యా 2 : కార్తీక్ ఆర్యన్ హీరో గా కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన  భూల్ భులయ్యా 2  మూవీ ఈ నెల 20 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.


' ఈ వారం 'ఓ టి టి' లో విడుదల కాబోయే సినిమాలు.


ఆర్ ఆర్ ఆర్ :  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ నెల 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' జీ 5 లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.


ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా  తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా,  ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించాడు.


భళా తందనాన : శ్రీ విష్ణు హీరోగా  తెరకెక్కిన భళా తందనానా మూవీ ఈ నెల 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి'  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.


జెర్సీ : షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని ఠాకూర్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఈనెల 20వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: