టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి రాజావారు రాణిగారు మూవీ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణమండపం' సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన ప్రియాంక జవాల్కర్ కథానాయకిగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో కిరణ్ అబ్బవరం కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఏర్పడింది.  

ఆ తర్వాత కిరణ్ అబ్బవరం 'సేబాస్టియన్' సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరం కు నిరాశనే మిగిల్చింది.  ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం  సరసన చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తోంది.  ఈ సినిమాకు గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ఫస్ట్ గ్లిమ్స్‌ ని విడుదల చేసింది.  చిత్ర బృందం విడుదల చేసిన ఈ ఫస్ట్ గ్లిమ్స్‌  కి  ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.  

ఇది ఇలా ఉంటే తాజాగా సమ్మతమే చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా సమ్మతమే సినిమా నుండి 'బావ తాకితే' అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  సమ్మతమే సినిమా నుండి  'బావ తాగితే' లిరికల్ వీడియో సాంగ్ ను  21 మే ఉదయం 11.11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. సమ్మతమే సినిమాను జూన్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: