ఇక యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి తెలిసే అంత పెద్ద సెలెబ్రెటి కాకపోయినా యూట్యూబ్ లో కొన్ని పనికిమాలిన ఫ్రాంక్ వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు ట్రోల్స్ తో కనిపిస్తాడు. కడపకి చెందిన శ్రీకాంత్ తనదైన డైలాగులతో అమ్మాయిలను ఇంకా వివాహమైన ఆడవాళ్ళని ఆటపట్టిస్తూ వారిపై ఏదో ఒక కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పాపం ఎవ్వరూ కూడా ఇతడిని పట్టించుకోరు. పైగా అందరూ ఇతడిని బాగా ట్రోల్ చేస్తూ ఓ రేంజ్ లో ఇతడితో ఆడుకుంటారు.అయితే తాజాగా శ్రీకాంత్ రెడ్డి పై ఇటీవల కరాటే కళ్యాణి అతని ఇంటికి వెళ్లి దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఏకంగా రోడ్డుపైకి అతన్ని లాక్కొచ్చి  శ్రీకాంత్ రెడ్డి పై చేయి చేసుకోవడంతో పాటు తనని గోరంగా అవమానించింది. అమ్మాయిలను ఏడిపించే రీతిలో చాలా అసభ్యకరంగా వారితో ప్రవర్తిస్తున్నాడని ఇంకా అలాగే ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడని.. ఇతడిని నానా బూతులు తిట్టింది.. అలాగే వీడియోని తీస్తూ అతడిని కొట్టడం కూడా జరిగింది.



అలాగే ఇదే సమయంలో కరాటే కళ్యాణి చంప చెల్లు మనేలా కొట్టాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక దీంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది. ఈ గొడవ కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.కానీ అతడిని ఎంత అవమానించిన కానీ అతనికి అదృష్టం వరించింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి కొంచెం పాపులారిటీని సంపాదించాడు. కరాటే కళ్యాణితో గొడవ జరిగిన తర్వాత శ్రీకాంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.. ఇక అసలు విషయంలోకి వెళ్తే .. బిగ్ బాస్-6 లో శ్రీకాంత్ రెడ్డి ని తీసుకునేందుకు షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు అనేక రకాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వెయిటింగ్ చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: