బుల్లి తెరపై సుమ కనకాల అంటే ఒక బ్రాండ్. బుల్లి తెర అంటే సుమ, సుమ అంటేనే బుల్లి తెర ఆమె లేకపోతే టెలివిజనే లేదు అన్నట్లుగా ఉంది. 20 ఏళ్లకు పైగా టాలీవుడ్ బుల్లి తెరను శాసిస్తున్న ఈమెకు ఇప్పటికీ అంతే పాపులారిటీ ఉంది. స్టార్ హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గని క్రేజ్ ఉంది. స్టార్ మహిళ వంటి ఒక షో 10 ఏళ్లకు పైగా సక్సెస్ఫుల్ గా టెలివిజన్ లో రన్ అయింది అంటే అందుకు ప్రధాన కారణం ఆ షోకి యాంకర్ గా వ్యవహరించిన సుమ అనే చెప్పాలి. ఈ యాంకర్ ఉంది అంటే ఆ షో సక్సెస్ ను అందుకోవడం ఖాయం. పెద్ద హీరోల చిత్రాలు అంటే ఆ సినిమాకి సంబంధించిన అన్ని ఈవెంట్స్ కు హోస్ట్ గా ముందుగా సుమనే సంప్రదిస్తారు దర్శక నిర్మాతలు.

ఇంతటి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సుమ కనకాల తాజాగా వెండి తెరపై జయమ్మ పంచాయితీ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్నది మొదలు భారీ అంచనాలను పోగు చేసుకుంది. సుమ కనకాల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని అంతా ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవడం ఖాయం అనుకున్నారు. అయితే రిలీజ్ అయ్యాక అంచనాలు తారుమారు అయ్యాయి. ఆశించిన స్థాయిలో ఈ సినిమా  ఆదరణ అందుకోలేకపోయింది.
పెట్టిన బడ్జెట్ లో సగం కూడా కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది. సహజమైన నటనతో సుమ కనకాల ఆకట్టుకుంటునప్పటికి కథ అంతగా కనెక్ట్ కాకపోవడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోతోంది.

సుమ వంటి బిగ్ సెలబ్రెటీ ప్రధాన పాత్రలో నటించడం వలన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ గట్టిగా రాబట్టిన క్లోజింగ్ డే కలెక్షన్ లో భారీ నష్టాలను వచ్చినట్లు తెలుస్తోంది.  థియేట్రికల్ బిజినెస్ పరంగా ఈ చిత్రం రూ.3.45 కోట్ల రూపాయలు బిజినెస్ జరుగగా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అంటే రూ.3.5 కోట్ల రూపాయలు తిరిగి వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రం కేవలం కోటి రూపాయల కలెక్షన్లను మాత్రమే రాబట్టి నిరాశను మిగిల్చింది. దీంతో ఈ చిత్రానికి పెద్ద మొత్తం లో దాదాపు 2.45 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: