తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు  చేయాల్సిన అవసరం లేదు. `గల్ఫ్` అనే మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ హాట్ భామ.


ఆ తర్వాత యురేక మరియు అభినేత్రి 2 చిత్రాల్లో నటించింది. కానీ, అవేమి ఆమెకు క్రేజ్ తెచ్చి పెట్టలేకపోయాయట. అప్పుడు డింపుల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `గద్దలకొండ గణేష్` సినిమా జర్రా జర్రా అనే ఐటెం సాంగ్ చేసి యూత్‌ను అయితే ఓ ఊపు ఊపేసింది.


సినిమాలతో రాని గుర్తింపు ఈ ఒక్క పాటతో దక్కించుకుంది డింపుల్ హయాతి.. ఇకపై ఐటెం సాంగ్స్ చేయకూడదని, హీరోయిన్‌గానే సత్తా చాటాలని భావించిందటఆమె కోరుకున్నట్లే సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు కూడా వచ్చాయి. ఇటీవలె ఆమె విశాల్‌తో `సామాన్యుడు`, మాస్ మహారాజ్ రవితేజలతో `ఖిలాడి` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే.



కానీ, ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఖిలాడి భామను పట్టించుకునే వారే అస్సలు లేరు. ఈ రెండు సినిమాల తర్వాత డింపుల్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అస్సలు ప్రకటించలేదు. అయితే ఆఫర్ల లేకపోవడంతో డింపుల్ మళ్లీ ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్ధమైందని తెలుస్తుంది.ఇందులో భాగంగా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న `ఎన్‌బీకే 107`లో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట.


ప్రస్తుతం బాలయ్య, డింపుల్ లపై ఆ స్పెషల్‌ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని.. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని అంటున్నారట.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్మించిన సెట్ లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.అంతేకాదు, సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని అందరూ అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో కాదో తెలియాల్సి ఉంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోందిట తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: